![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -409 లో... కళ్యాణ్ ని తను చెప్పినట్టు వినేలా చేసుకోవాలని అనామిక భావించి.. అందంగా ముస్తాబవుతుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. తన చెయ్యిని ప్రేమగా పట్టుకుంటే పక్కకి తీసేస్తాడు కళ్యాణ్. అదేంటి భార్య భర్తని ప్రేమగా ముద్దు పెట్టుకోకూడదా అని అనామిక అంటుంది. ఒకసారి పూలకుండి తీసుకొని దాన్ని కింద పగులగొట్టని అనామికకి కళ్యాణ్ చెప్పగానే.. తను అలాగే చేస్తుంది.
పూలకుండి కింద పడిపోయింది.. పగిలిపోయింది దానికి సారీ చెప్పు అని కళ్యాణ్ అనగానే.. అదేంటి అంటూ పూలకుండికి సారీ చెప్తుంది. ఇప్పుడు సారీ చెప్పగానే ఆ పూలకుండి అతుక్కున్నదా లేదు కదా.. నా మనసు కూడా అంతే అని కళ్యాణ్ అంటాడు. మనసు విరిగిపోతే మళ్ళీ అతికించలేమంటు కళ్యాణ్ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కావ్య స్నానం చేసి వస్తుంది. నిద్రలో ఉన్న రాజ్ ని చూసి.. మీకు నాపై ప్రేమ లేదు అనుకున్నప్పుడే మీపై ప్రేమ చూపించాను. అలాంటిది మీకు నాపై ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ లగా ఉండనా అని కావ్య అనుకుంటూ రాజ్ దగ్గరకు వెళ్లి.. ముద్దు పెట్టాలని ట్రై చేస్తూ ఆగిపోతుంది. ఆ తర్వాత కావ్య సిగ్గుపడుతుంటే.. అప్పుడే రాజ్ నిద్ర లేచి ఎందుకు సిగ్గు పడుతున్నావని అడుగుతాడు. కావ్య సిగ్గు పడుతూ వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత కళ్యాణ్ హాల్లో కూర్చొని కవితలు రాస్తుంటే.. రుద్రాణి చూసి అనామికకి చెప్తుంది. అనామిక ధాన్యలక్ష్మిని కళ్యాణ్ దగ్గరికి తీసుకొని వచ్చి.. ఆఫీస్ కి వెళ్లకుండా కవితలు రాస్తు కూర్చొని ఉన్నాడని చెప్తుంది. కళ్యాణ్ కళ్యాణ్ అని అనామిక ఎంత పిలిచినా పలకడు.. ఆ తర్వాత ఆఫీస్ కి ఎందుకు వెళ్ళలేదని అనామిక అడుగుతుంది. నీకెందుకు చెప్పాలని కళ్యాణ్ అంటాడు. నేను నీ భార్యని అని అనామిక అనగానే.. భార్య అయితే భర్తపై పోలీస్ కేసు పెడుతుందా? ఇన్ని రోజులు నీకు నచ్చినట్టున్నాను కానీ ఇక నాకు నచ్చినట్టు ఉంటానని కళ్యాణ్ అంటాడు. ఆఫీస్ కి ఎవరు వెళ్లకుంటే ఎలా అని అపర్ణ అంటుంది. అది మీ ప్రాబ్లమ్.. అన్నయ్య తప్పు చేసాడని మీరు ఆఫీస్ కి వద్దన్నారని కళ్యాణ్ అనగానే.. అపర్ణ కోపంగా కళ్యాణ్ అంటు అరుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |